Virat Kohli's Crazy Fan, Dedicated16 Tattoos To Indian Captain!! | Oneindia Telugu

2019-12-23 164

Virat Kohli will look to end the year with a series triumph when India face the West Indies in the third and final match of the three-match One-Day International (ODI) series in Cuttack on Sunday.
#ViratKohli
#kohlifan
#pintubehara
#indvswi2020
#rohitsharma
#msdhoni
#cricket
#teamindia


టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలు అందించిన కెప్టెన్‌ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'కింగ్' కోహ్లీ ఏ ఫార్మాట్ అయినా పరుగుల వరద పారిస్తూ రికార్డులు కొల్లగొడుతున్నాడు. మరోవైపు తన దూకుడైన నాయకత్వంతో ఆకట్టుకుంటున్నాడు. కోహ్లీ ఆటకు ఎంతో మంది దిగ్గజ క్రికెట్ ఆటగాళ్లు కూడా ఫిదా అయ్యారు. ఇక భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోహ్లీకి భారీగా అభిమానులు ఉన్నారు.
కోహ్లీపై ఉన్న అభిమానంతో ఆయనను కలవాలని, ఫొటోలు దిగాలని అనుకుంటారు. అయితే కోహ్లీ అంటే పిచ్చి ప్రేమ ఉన్న ఓ అభిమాని ఏకంగా ఒంటిపై 16 ట్యాటూలు వేయించుకుని ఆచ్చర్యపరిచాడు. అతడే పింటు బెహరా. కటక్‌ వన్డే కోసం కోహ్లీ శనివారం బారాబతి మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ సమయంలో కోహ్లీని పింటు బెహరా కలిశాడు. అంతేకాదు చొక్కా విప్పి తన ఒంటిపై ఉన్న ట్యాటూలను కోహ్లీకి చూపించాడు. దీంతో టీమిండియా కెప్టెన్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. కోహ్లీ తన అభిమానితో మాట్లాడి ఫొటోలు దిగాడు.

Videos similaires